
స్నేహితుల్ని వారి పుట్టినరోజున ఎలా సంతోషపర్చాలో మనందరికీ తెలుసు. డ్రెస్, యాక్సెసరీ, హాలిడే టికెట్స్, ఇతర బహుమతులు ఏవైనా పుట్టిన రోజు నాడు గిఫ్ట్స్‌గా ఇచ్చి మెమొరబుల్‌గా మార్చొచ్చు. కానీ మీ స్నేహితురాలు గర్భవతి అయితే? మీరు ఆమెకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు? అప్పుడు కూడా మీరు డ్రెస్సులు, యాక్సెసరీస్ కొని ఇవ్వొచ్చు. కానీ గర్భవతులకు 10 బెస్ట్ గిఫ్ట్స్ గురించి తెలుసుకొని, వాటిని ఇచ్చి వారి ప్రెగ్నెన్సీ మరింత గుర్తుండిపోయేలా మార్చండి.
ప్రెగ్నెన్సీలో దశలు దాటుతున్న కొద్దీ, పెరుగుతున్న కడుపు తుంటి, వీపు, మోకాళ్లపై ఒత్తిడి కలిగిస్తుంటాయి. ప్రెగ్నెన్సీ పిల్లో ఇలాంటి నొప్పులకు ఉపశమనం కలిగిస్తూ, వారు సురక్షితమైన పొజిషన్‌లో నిద్రపోయేందుకు ఉపయోగపడుతుంది. ఈ పిల్లో శరీరానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా రెండో, మూడో ట్రైమిస్టర్‌లో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భవతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ప్రెగ్నెన్సీ పిల్లో ఇస్తే, ప్రెగ్నెన్సీ ఉన్నన్ని రోజులూ మీకు థ్యాంక్స్ చెబుతూనే ఉంటుంది. ముందు, వెనుక మంచి సపోర్ట్ కోసం యూ షేప్ ఉన్న పిల్లో కొనండి.
కాబోయే తల్లికి బాత్ పిల్లో గిఫ్ట్‌గా ఇస్తే మీకు ఆశీర్వాదం రావడం ఖాయం. ఆమెకు రిలాక్సేషన్ టైమ్ మరింత బెటర్‌గా లభిస్తుంది. మీరు ఆమె విషయంలో కేరింగ్‌గా ఉన్నామని, క్వాలిటీ టైమ్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పడానికి ఇది ఓ మార్గం.
మెటర్నిటీ సపోర్ట్ బెల్ట్ గర్భవతులకు పుట్టినరోజున ఇవ్వడానికి మరో మంచి గిఫ్ట్. ప్రెగ్నెన్సీలో దశలు దాటుతున్నకొద్దీ, కడుపు కిందకు జారుతూ మోకాళ్లపై, వెన్నుపై ఒత్తిడి కలిగిస్తుంది. ఈ సమయంలో మెటర్నిటీ సపోర్ట్ బెల్ట్ కడుపును కాస్త పైకి ఎత్తడం కారణంగా ఒత్తిడి తగ్గుతుంది. పడుకున్నప్పుడు మెమొరీ ఫోమ్ ప్యాడ్స్ కారణంగా అదనంగా సపోర్ట్ లభిస్తుంది. ప్రతీ రోజు పనిచేసేప్పుడు, వ్యాయామం చేసేప్పుడు, షాపింగ్‌కు వెళ్లినప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈ బెల్ట్ ధరించవచ్చు. అడ్జెస్టబుల్ స్ట్రాప్స్ ఉంటాయి కాబట్టి కడుపు సైజ్‌ని బట్టి అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
బిడ్డ మొదటి ఫోటోగ్రాఫ్‌ను ఫ్రేమ్ కట్టించి ఇస్తే ఆ తల్లికి అంతకన్నా సర్‌ప్రైజ్ ఇంకేం ఉంటుంది. ఆమె ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె ఎక్కువగా ఆరాధించే స్వీట్ గిఫ్ట్ కూడా ఇదే. ఫోటో లేదా కొల్లేజ్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. హృదయపూర్వకంగా బహుమతి అందించే మీకు కాబోయే తల్లి నుంచి థ్యాంక్స్ రావడం ఖాయం.
చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ తప్పు కానే కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు స్వీట్లు ఎక్కువగా తినాలనుకుంటారు. వారికి చాక్లెట్ బాక్స్ కన్నా గొప్ప బహుమతి ఉండదు. అయితే కాబోయే తల్లికి ఎలాంటి చాక్లెట్స్ ఇష్టమో తెలుసుకోండి. షాపింగ్‌కి వెళ్లినప్పుడు సిల్వర్డ్ ఆల్మండ్స్, రోస్టెడ్ కాజూ, పిస్తా లాంటి అనేక ఫ్లేవర్స్‌లో చాక్లెట్స్ లభిస్తాయి.
గర్భవతిగా ఉన్నప్పుడు చర్మంపై, శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. కాబట్టి మీరు మెటర్నిటీ స్కిన్‌కేర్ సెట్‌ను కాబోయే తల్లికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. అందులో టమ్మీ బటర్ ప్రధానంగా ఉండాలి. ఇది పొట్ట ప్రాంతాన్ని రిలాక్స్ చేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ సీరమ్ చర్మంపై చారల్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఈ సెట్‌లో మంచి మసాజ్ లోషన్ కూడా ఉండాలి. పాదాలు మర్దన చేయడానికి, బాడీ మసాజ్ కోసం ఉపయోగపడుతుంది. వీటిలో జుట్టును బలపర్చే మంచి ఆయిల్ కూడా చేర్చాలి.
గర్భవతిగా ఉన్నప్పుడు మూడో ట్రైమిస్టర్‌లో పాదాలు ఉబ్బడం సాధారణం. గర్భవతిగా ఉన్న మీ స్నేహితురాలికి నొప్పి తగ్గించేందుకు ఫుట్ మసాజర్ బహుమతిగా ఇవ్వడం అద్భుతమైన ఐడియా. ఈ మసాజర్‌తో ఆమె రిలాక్స్ కావడం మాత్రమే కాదు, సాయంత్రానికి ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
డైట్ లాగానే, గర్భవతికి వార్డ్‌రోబ్ కూడా మారుతుంది. ఆమెకు ఉన్న అన్ని ఫేవరెట్ దుస్తులు ఇప్పుడు పట్టకపోవచ్చు. మీరు ఆమెకు సౌకర్యంగా ఉండే మంచి కాటన్ మిడీ డ్రెస్ బహుమతిగా ఇస్తే మీకు కృతజ్ఞతగా ఉంటుంది. ఆమె ఫేవరెట్ కలర్స్, ప్రింట్స్ ఉన్నవి తీసుకోవడం మర్చిపోవద్దు. ఏమో, బేబీ షవర్ కోసం ఆమె అదే డ్రెస్ వేసుకుంటుందేమో ఎవరికి తెలుసు.
గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతీ విషయం సౌకర్యం కోసం చూస్తారు. శరీరంలో మార్పులు వస్తుంటాయి కాబట్టి గతంలో ఉపయోగించిన వస్తువులు చాలా వరకు వాడే అవకాశం ఉండదు. ఆమెకు కాస్త సులభంగా ఉండేలా మీరు ఆలోచిస్తే మీ అంత గొప్పవారుండరు. సౌకర్యంగా ఉండే స్లిప్పర్స్ ఆమెకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్రెగ్నెంట్ బర్త్‌డే గాళ్‌కి హాస్పిటల్ బ్యాగ్ బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన. పోస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరమైన వస్తువులన్నీ ప్యాక్ చేయడానికి ఈ బ్యాగ్ ఉపయోగపడుతుంది. అందులో పిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా ఉంటాయి. విశాలంగా ఉండే బ్యాగ్ కొనివ్వడం వల్ల తల్లితో పాటు, పిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ అందులో ప్యాక్ చేయొచ్చు.
గర్భవతులకు బర్త్‌డే గిఫ్ట్స్‌గా వీటిని ఇవ్వొచ్చు. అయితే ఆమె ఇష్టాయిష్టాలను బట్టి మీరు మరిన్ని గిఫ్ట్స్ ఆలోచించొచ్చు. మీ బహుమతితో వారి ప్రెగ్నెన్సీ జర్నీ సంతోషకరంగా, చిరస్మరణీయంగా మారాలి.




This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |